- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కుక్కకాట్లపై మరోసారి మేయర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: అధికార బీఆర్ఎస్‌లో మరోసారి ప్రోటోకాల్ వ్యవహారం భగ్గుమంది. సోమవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని కొంతమంది మహిళా నేతలు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సమక్షంలోనే వాదనకు దిగారు. ఇదేం తీరని ప్రశ్నించారు. అందరికీ గౌరవం దక్కాలని కానీ అలా జరగడం లేదని నేతలు మండిపడ్డారు. అధికార పార్టీ మహిళా నేతల మధ్య చోటు చేసుకున్న ఈ పరిణామం గులాబీ పార్టీలో హాట్ టాపిక్‌గా అయింది. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఎవరికో కుక్క కరిస్తే అది తానే కరవమని ఆ కుక్కతో చెప్పినట్లుగా కొందరు క్రియేట్ చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్ మేయర్‌గా పని చేయడం అంత సులువైన పని కాదని ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారని, బీఆర్ఎస్‌లో మహిళా కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళలు ముందుకు వెళ్లాలన్నారు. కాగా గతేడాది మేయర్ ఉప్పల్ నియోజకవర్గంలో మేయర్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజా మహిళా దినోత్సవం సందర్భంగా మేయర్ సమక్షంలో ప్రోటోకాల్ వివాదం తెరపైకి రావడం గులాబీ పార్టీలో చర్చగా మారింది.