మరోసారి సాగర్‌కు భారీగా పెరిగి వరద.. 26 గేట్లు ఎత్తివేత

by Mahesh |
మరోసారి సాగర్‌కు భారీగా పెరిగి వరద.. 26 గేట్లు ఎత్తివేత
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణ నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. ఈ నదిపై ఉన్న అన్ని డ్యాములు ప్రస్తుతం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సమయానికి నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 26 గేట్లను ఎత్తి శ్రీశైలం నుంచి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ కు 2,50,629 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2,50,629 క్యూసెక్కులు ఔట్ ఫ్లో వెళ్తుంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 589.4 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 310.25 టీఎంసీలుగా కొనసాగుతుంది. కాగా ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో రెండు నెలల వ్యవధిలోనే సాగర్ గేట్లను పలుమార్లు అధికారులు ఎత్తారు.

Advertisement

Next Story

Most Viewed