- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rain alert: రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
దిశ, వెబ్ డెస్క్: వర్షాకాలం కావడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించే ప్రధాన నదులు నిండుకుండా మారిపోయాయి. దీంతో సాగర్ మినహా అన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం గేట్లు తీశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఈ రోజు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ ప్రకారం తెలంగాణలోని జగిత్యాల, జనగాం, ఆదిలాబాద్, కొమురంభీం, మహబూబ్‌నగర్, కామారెడ్డి, కరీంనగర్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, యాదాద్రి, హనుమకొండ జిల్లాలో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఈ సమయంలో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని బావులు, పోలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఇప్పటికే చెరువులు, వాగులు నిండుకుండల్లా మారడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.