మరోసారి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-09 06:35:05.0  )
మరోసారి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, కరీంనగర్ బ్యూరో: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా రైతు దినోత్సవం రోజు ఉద్దేశించి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మరువకముందే తాజాగా చెరువుల పండుగ సందర్భంగా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంటలోని నాయిని చెరువు వద్ద నిర్వహించిన వేడుకల్లో కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిపిస్తే జమ్మికుంట పట్టణాన్ని సిరిసిల్ల, సిద్దిపేట పట్టణాలు లాగా తీర్చిదిద్దడంతో పాటు జమ్మికుంట నడిబొడ్డున ఆర్ఓబి బ్రిడ్జిని తొలగిస్తానని అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు మరో మారు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి.

Click here for Video

Read More... ఎమ్మెల్యేకు షాక్ ఇస్తున్న ప్రజలు.. ఏం చేశావంటూ వరుసగా నిలదీయడంతో ఫ్రస్ట్రేషన్

అనూహ్యంగా వ్యూహం మార్చిన కేసీఆర్.. బలం పుంజుకుంటోదనే భయం!


Advertisement

Next Story