- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్‌లో కాక రేపుతున్న Kadiam కామెంట్స్!
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాలు చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ కు ఇంటిపోరు సమస్యగా మారుతోంది. ఎన్నికల వేళ క్షేత్ర స్థాయిలో నెలకొన్న అంతర్గత పోరు ఎప్పుడు ఏ రూపంలో బహిర్గంత అవుతాయో అంచనా వేయడం గులాబీ బాస్ కు కత్తిమీద సాముగా మారుతోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో సంచలనం రేపుతున్నాయి. అసలే ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా ట్రోల్ చేసేందుకు ప్రత్యర్థులు కాచుకుకూర్చున్న వేళ కడియం శ్రీహరి చేసిన పొలిటికల్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఎవరికి తల వంచి పాదాభివందనం చేయలేదని, తప్పు చేయం తలవంచం అని అన్నారు. తప్పు చేసిన వాళ్లే తలవంచుతారని, ఎవరూ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని సూచించారు. ఆత్మాభిమానంతో బతకాలని అదే ఆత్మాభిమానంతో రాజకీయాలు చేయాలన్నారు. ఆర్జించడం కాదు, ఆత్మగౌరవంతో బతకాలని శ్రీహరి అన్నారు. కడియం చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.
కడియం టార్గెట్ ఏంటి?:
కడియం చేసిన వ్యాఖ్యలపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం ఉంది. తరచూ ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. బీర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవితను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనం చేసిన వీడియో వైరల్ అయింది. బీజేపీ నేతలు ఈ వీడియోను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. పార్టీ పేరు మారిన రాచరిక ఆలోచనలు మారలేదని గిరిజన మహిళ దొర కాళ్లు మొక్కడం ఏంటని నిలదీశారు. ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే కడియం ఎవరి కాళ్లు మొక్కవద్దని, ఆత్మగౌరవంతో బతకాలని కామెంట్స్ చేయడం చర్చకు దారి తీసింది. ఈ కామెంట్స్ ద్వారా కడియం ఎవరిని టార్గెట్ చేశారనేది పార్టీలో చర్చ జరుగుతోంది.