క్షణక్షణం ఉత్కంఠ.. ఏం ప్రశ్నించారు.. ఏం చెప్పిందోనని సస్పెన్స్

by Nagaya |   ( Updated:2022-12-12 04:21:49.0  )
క్షణక్షణం ఉత్కంఠ.. ఏం ప్రశ్నించారు.. ఏం చెప్పిందోనని సస్పెన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కవిత ఇంటి వద్ద క్షణక్షణం ఉత్కంఠ రేపింది. ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారణను ప్రారంభించారు. లిక్కర్ స్కాంలో ఉన్న మనిష్ సిసోసిడియా కేసులో విచారణ చేపట్టారు. అయితే సాయంత్రం 6.30 గంటలకు విచారణ ముగిసింది. అధికారులు అసలు ఏం విచారణ చేస్తున్నారు... కవిత ఏం సమాధానం చెబుతుంది... ఏం జరుగుతుందో తెలియక పార్టీ శ్రేణులతో పాటు ఆమె అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఇంటి పరిసరాల్లోనే అటూ ఇటు తిరుగుతూ కనబడినవారందరినీ ఆరాతీశారు. సీబీఐ అధికారులు 7.30గంటల పాటు విచారణ చేశారు. అయితే ఏం జరిగిందో తెలియలేదు. కవితను ఏం ప్రశ్నించారు... ఏం చెప్పిందో మాత్రం సస్పెన్స్. అయితే సీబీఐ అధికారులు విచారణ ముగించుకొని వెళ్లిపోయిన తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కవిత ఇంటికి చేరుకున్నారు. ఆమెను కలిసేందుకు పోటీపడ్డారు. జై కవితక్క అంటూ నినాదాలు చేశారు. కవిత అభిమానులకు అభివాదం చేశారు. తరలివచ్చినవారందరినీ ఆత్మీయంగా పలుకరించారు.

ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో...

కవిత ఇంటి వద్ద బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఏ ఒక్కరిని కవిత ఇంటికి వెళ్లడానికి అనుమతించలేదు. సాధారణంగా కవిత ఇంటివద్ద 10మంది పోలీసుల బందోబస్తు ఉంటుంది. అయితే సీబీఐ విచారణ నేపథ్యంలో అదనంగా 50మంది పోలీసు సిబ్బంది నియమించారు. కవిత నివాసం ఉంటున్న కాలనీవాసులను సైతం క్షణ్నంగా పరిశీలించిన తర్వాతనే పంపించారు. సుమారు 20 మందికి పైగా ఇంటెలిజెన్స్ సిబ్బందిని నియమించారు.

రెండుకార్లలో సీబీఐ అధికారులు

డీఐజీ రాఘవేంద్ర వత్స నేతృత్వంలో ఆరుగురుతో కూడిన బృందం ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చారు. సీబీఐ అధికారులు ఏపీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కార్లలో వచ్చారు. ఏపీ27, ఏపీ3344, ఏపీ 09 బీవై 0450 కార్లలో వచ్చారు.

Read more:

TRS MLC Kalvakuntla Kavitha :కవితకు నోటీసులు.. అసలేంటి CRPC 91?

Advertisement

Next Story

Most Viewed