కొండ పైనుంచి టన్నెల్‌లోకి చేరుకోవాలంటే.. ఇక అదొక్కటే మార్గం

by Gantepaka Srikanth |
కొండ పైనుంచి టన్నెల్‌లోకి చేరుకోవాలంటే.. ఇక అదొక్కటే మార్గం
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌ కర్నూల్(Nagar Kurnool) జిల్లా దోమలపెంటలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel Accident) వద్ద జరిగిన ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సురక్షితంగా తిరిగి వస్తారా? లేదా? అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)లు నిత్యం పరిస్థితి పరిశీలిస్తున్నారు. తాజాగా కాంట్రాక్టర్ ఏజెన్సీలు, రెస్క్యూ సిబ్బందితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిస్థితిని అధికారులు మంత్రికి వివరించారు. కొండపైనుంచి టన్నెల్‌ లోనికి చేరుకోవాలంటే 400 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అలా జరిగితే టన్నెల్‌లోనికి చేరుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

కాగా, అంతకుమందు.. 11 కి.మీ వరకు లోకో ట్రైన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌(NDRF) బృందాలు సొరంగం లోనికి వెళ్లాయి. రెండు వైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోయాయి. అయినా.. ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నా్యి. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి నెలకొందని తెలిపాయి. ఫ్లై కెమెరాతో లోపల దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని NDRF బృందాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story

Most Viewed