పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. బస్సు, ట్రైన్ టికెట్ల బుకింగ్‌పై ఆఫర్

by Javid Pasha |   ( Updated:2023-11-05 14:27:14.0  )
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. బస్సు, ట్రైన్ టికెట్ల బుకింగ్‌పై ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి సందర్భంగా ప్రముఖ యూపీఐ పేమెంట్స్ ఫ్లాట్‌ఫామ్ పీటీఎం ఆఫర్ ప్రకటించింది. బస్సు, రైలు టికెట్ల బుకింగ్‌పై రాయితీలు ప్రకటించింది. బస్సు టికెట్ల బుకింగ్‌పై రూ.500 వరకు తగ్గింపు అందించనున్నట్లు తెలిపింది. అలాగే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణానికి ఆరు గంటల ముందు రద్దు చేసుకుంటే 100 శాతం రీఫండ్ ఇవ్వనున్నట్లు పేటీఎం స్పష్టం చేసింది. అలాగే క్షణాల్లోనే రీఫండ్ నగదును అకౌంట్లో జమ చేయనున్నట్లు పేటీఎం తెలిపింది. దీంతో పాటు యూపీఐ పేమెంట్స్‌కు ఎలాంటి అదనపు రుసుం ఉండదని పేటీఎం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed