- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి 15 నుండి ఆఫ్ డే స్కూల్స్

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులను నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు. ప్రతి విద్యా సంవత్సరం వేసవి కాలంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికార ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, మేనేజ్‌మెంట్‌ల పరిధిలోని ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్‌లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్‌కు సిద్ధం చేయడానికి ప్రత్యేక తరగతులు కొనసాగిస్తారు. టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని అధికారులు పేర్కొన్నారు.