- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సౌత్ గ్రూపు’ వినియోగంపై అభ్యంతరం.. ధర్మాసనం కీలక సూచన
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ లాబీ, సౌత్ గ్రూపు, సౌత్ కార్టెల్ లాంటి పదాలను దర్యాప్తు సంస్థలు వినియోగించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక నేరానికి లేదా అభియోగానికి ప్రాంతీయతను అంటగట్టడం సమంజసం కాదని, ఇది రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ స్ఫూర్తికి విరుద్ధమైనదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పదాలను సీబీఐ, ఈడీ వాటి ఎఫ్ఐఆర్‌లలో, చార్జిషీట్‌లలో పేర్కొనడం ఆ ప్రాంతానికి చెందినవారందరికి అంటగట్టేదిగా ఉన్నదని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రాతిపదిక కలిగిన భారతదేశంలో సౌత్ గ్రూపు, సౌత్ లాబీ, బిహార్ గ్రూపు, మరాఠా గ్రూపు, యూపీ గ్రూపు.. ఇలాంటి పదాలను వాడడం సరైన చర్య కాదని సూచించారు.
దర్యాప్తు సంస్థలు వాటి అధికారిక డాక్యుమెంట్లలో ఇలాంటి పదాలను వినియోగించడంతో న్యాయస్థానాలు కూడా వాటి ఉత్తర్వుల్లో ఇదే పదజాలాన్ని వినియోగిస్తున్నాయని ఉదహరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మార్చి 10వ తేదీన రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు వెలువరించిన బెయిల్ ఉత్తర్వుల్లో సౌత్ లాబీ అనే పదాన్ని పలుచోట్ల ప్రస్తావించిందని పిటిషనర్ గుర్తుచేశారు. ఒక వ్యక్తి జన్మస్థలానికి, స్థానికతకకు, ప్రాంతానికి నేరాన్ని ముడిపెట్టి సంబోధించడం ద్వారా ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు విఘాతం కలుగుతున్నదని, సాధారణ సూత్రీకరణగా మారుతున్నదని గుర్తుచేశారు. గతంలో ఇలాంటివాటి ద్వారా వివక్ష, బలిపశువులను చేయడం, నిందితులుగా ముద్రవేయడం, చివరకు హింస చోటుచేసుకోవడం లాంటివి జరిగాయని పేర్కొన్నారు.
ఇలాంటి ప్రాంతీయ వివక్షలకు తావు ఇవ్వరాదనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని రాసే టైమ్‌లో మేధావులు అనేక విధాలుగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఇకపైన దర్యాప్తు సంస్థలు సౌత్ గ్రూప్, సౌత్ లాబీ, సౌత్ లిక్కర్ గ్యాంగ్, సౌత్ కార్టెల్ లాంటి పదాలను వాడకుండా నిషేదించేలా ఉత్తర్వులు ఇవ్వాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ అభిప్రాయాలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఇదే విషయాన్ని రాతపూర్వకంగా సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్ళాలని పిటిషనర్‌కు సూచించారు. ఇలాంటి పదజాలాన్ని దర్యాప్తు సంస్థలు వాడకుండా ఉంటేనే మంచిదని అభిప్రాయపడింది. దర్యాప్తు సంస్థలకు మెమొరాండం ఇవ్వనున్నట్లు కార్తీక్‌రెడ్డి తెలిపారు.