CM రేవంత్.. జాబ్ క్యాలెండర్ అంటే అర్థం తెలుసా..? NVSS ప్రభాకర్

by Satheesh |
CM రేవంత్.. జాబ్ క్యాలెండర్ అంటే అర్థం తెలుసా..? NVSS ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్.. కేవలం మాటల ప్రభుత్వమేనని, చేతల ప్రభుత్వం కాదని, కానీ మూటలు కట్టడంలో మాత్రం దిట్ట అని, ఆ మూటలను ఢిల్లీకి పంపించమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాబ్ క్యాలెండర్ అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు. పోటీ పరీక్షలు గ్యాప్ లేకుండా జరుగుతున్నాయని, విద్యార్థులు, నిరుద్యోగుల్లో ప్రభుత్వం కన్ఫ్యూజన్ సృష్టిస్తోందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్.. నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వమని ఫైరయ్యారు. ఏ ప్రభుత్వమైనా ఏం చేశామో చెప్పి శాసనసభ సమావేశాలకు వెళ్తుందని, మరీ కాంగ్రెస్ ఏం చేసిందని సమావేశాలు నిర్వహిస్తోందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో దాదాపు 19 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉన్నాయని ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ రిలీజ్ చేయకపోవడంతో వాటిని ఇవ్వకుండా యాజమన్యాలు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రూ.6500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కాలేజీలకు చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం రూ.3300 కోట్లు బాకీ పడిందని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉచిత బుక్స్ కూడా ఇవ్వలేదని ప్రభాకర్ విమర్శలు చేశారు. ఏ పథకం కావాలన్నా రేషన్ కార్డు మస్ట్ అని నిబంధన పెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కొత్త రేషన్ కార్డ్ ఇచ్చింది లేదని ఆయన ఫైరయ్యారు. అప్పు చేస్తే కానీ ప్రభుత్వం నడిచే పరిస్థితి తెలంగాణ లేదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు.

బీజేపీ సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. హిందువుల దేవాలయాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్నే కాంగ్రెస్ కొనసాగిస్తోందని విమర్శలు చేశారు. ఆలయాల భూములను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ధారాధత్తం చేస్తోందని విరుచుకుపడ్డారు. రూ.కోట్ల విలువ చేసే భూములను రూ.లక్షకే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఆలయాల భూములను ఇష్టానుసారంగా ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందా అని పేరాల ప్రశ్నించారు. ఎండోమెంట్ చట్టాలను తుంగలో తొక్కిన అధికారులు ప్రభుత్వం చెప్పినట్లు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల భూముల పరిరక్షణకు పూనుకోవాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అన్ని దేవాలయాల వద్దకు వెళ్లి సర్వే చేపడుతుందని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed