హెల్త్ వర్సిటీలో నర్సింగ్ వింగ్ ఏర్పాటు చేయాలి : ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్

by M.Rajitha |
హెల్త్ వర్సిటీలో నర్సింగ్ వింగ్ ఏర్పాటు చేయాలి : ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో నర్సింగ్ వింగ్ ను ఏర్పాటు చేయాలని ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ రాజేశ్వరి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహాకు రిక్వెస్ట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి దాదాపు 110 నర్సింగ్ కాలేజీలు ఉన్నాయని, వీటి అకాడమిక్ వ్యవస్థను సమర్ధవంతంగా నడిపించేందుకు నర్సింగ్ వింగ్ లేకపోవడం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. దీంతో పాటు దాదాపు 52 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లు టీఎస్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యారని, వీళ్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నర్సింగ్ డైరెక్టరేట్ అవసరమని స్పష్టం చేశారు. ఇక టైమ్ బౌండ్ ప్రమోషన్లు కూడా కల్పించాలన్నారు. మరోవైపు ఈ నెల 26న జరిగే లీడర్షిప్ ఇన్ నర్సింగ్ ఇన్ స్ప్రింగ్ విజన్ డ్రైవింగ్ ఛేంజ్ ప్రోగ్రామ్ కు చీఫ్​ గెస్ట్ గా రావాలని ఆహ్వానించారు.

Advertisement

Next Story