- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రవీణ్ ఫోన్‌లో మహిళల నగ్న ఫొటోలు.. పోలీసుల కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో TSPSC పేపర్ లీక్ ప్రకంపనలు సృష్టిస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్‌కుమారే పేపర్ లీక్‌కి కారణమని పోలీసులు గుర్తించారు. ఓ యువతి కోసమే ప్రవీణ్ లీక్‌కు పాల్పడ్డాడని తెలిపారు. తాజాగా.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగానే నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని కీలకమైన వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
2017లో టీఎస్‌పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన ప్రవీణ్, నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్‌లో పనిచేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వెరిఫికేషన్ కోసం వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకొని, దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సాన్నిహిత్యం పెంచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేగాక, పలువురు మహిళలతో శారీరక సంబంధాలు ఏర్పరచుకున్నట్లు గుర్తించారు. ప్రవీణ్ ఫోన్‌లో ఎక్కువమంది మహిళల ఫోన్ నెంబర్లు ఉన్నాయని, పలువురి వాట్సాప్ చాటింగ్‌లో నగ్న ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఏఈ పరీక్ష పేపర్ కూడా రేణుక అనే మహిళ కోసమే లీక్ అయిందని పేర్కొన్నారు. దీంతో నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.