- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ చిరస్మరణీయుడు : తుమ్మల, ఎమ్మెల్యే సండ్ర
దిశ, సత్తుపల్లి : పేద ప్రజల గుండెల్లో నందమూరి తారక రామారావు చిరస్మరణీయడని ఎమ్మెల్యే సండ్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎన్టీఆర్ ఆశయాలకు ఆదేశాలకు అనుకూలంగా పనిచేస్తామే తప్ప పదవుల కోసం పనిచేయలేదన్నారు. నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో పాత సెంటర్ నుంచి స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. యుగ పురుషుడు ఎన్టీ రామారావు అన్నారు. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఏకైక మహానేత ఎన్టీ రామారావు అన్నారు.
100 సంవత్సరాలు గడిచిన పేద ప్రజల గుండెల్లో ఎప్పుడు ఎన్టీరామారావు చిరస్మరణీయడన్నారు. ఎన్టీ రామారావు రాజకీయ భిక్ష వల్లనే నేను ఇంతటి గొప్ప పదవులు పొందానన్నారు. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలు మహిళా రిజర్వేషన్ బిల్లు పేద ప్రజల గుండెల్లో, మహిళల గుండెల్లో ఎప్పుడు నిలిచే ఉంటాయన్నారు. చిత్ర రంగంలో రాజకీయ రంగంలో నూతన ఒరవడి సృష్టించిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. గత కాలంలో ఎన్టీఆర్ అవలంబించిన రాజకీయ సమీకరణాలు సంక్షేమ పథకాలు ఇప్పుడు రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జడ్పీటీసీ సభ్యులు కూసం పూడి రామారావు, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, వార్డ్ కౌన్సిలర్లు వీరపనేని బాబీ రాధిక, తడికమళ్ళ ప్రకాశరావు, చాంద్ బాషా, అద్దంకి అనిల్, కంటి అప్పారావు, మట్టా ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మోనార్క రఫీ, అంకం రాజు, చల్లగుళ్ళ నరసింహారావు, వినుకొండ కృష్ణ, సండ్ర అభిమానులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు కార్యకర్తలు, కమ్మ సంక్షేమ సంఘం, ఎన్టీ రామారావు సంక్షేమ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.