మునుగోడుకు NSUI దండు.. వెయ్యి మందితో కాంగ్రెస్ భారీ ప్లాన్

by GSrikanth |
మునుగోడుకు NSUI దండు.. వెయ్యి మందితో కాంగ్రెస్ భారీ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఎన్నికల నేపథ్యంలో బెల్టు షాపులు, ఏజెంట్లు, కమీషన్ల పర్వం కొనసాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు NSUI యాత్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో ఆయన "ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం" యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై NSUI రాష్ట్ర కమిటీ ఎంతో పోరాటం చేస్తోందని, సామాజిక బాధ్యతగా ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. వేయి మందితో దండు కట్టి మునుగోడు ప్రజలకు ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతుందో గుర్తు చేయనున్నట్లు తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పాదాభివందనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాలని చెప్పేందుకే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం NSUI తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. రాజకీయ నాయకులంటేనే చీడపురుగుల్లా చూసే పరిస్థితిని టీఆర్‌ఎస్, బీజేపీ కల్పించాయని విమర్శించారు. పోరాట స్ఫూర్తి ఉన్న మునుగోడులో ప్రస్తుతం ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. సిద్ధాంతాలకు ప్రతినిధులమని చెప్పుకునే అమిత్ షా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసమే హైదరాబాద్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed