ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అవి అమ్మితే నోటీసులు!.. విద్యాధికారి హెచ్చరిక

by Ramesh Goud |
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అవి అమ్మితే నోటీసులు!.. విద్యాధికారి హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పాఠశాల పరిసర ప్రాంతాల్లో లాభపేక్ష ఆశించి విక్రయాలు చేయవద్దనr జిల్లా విద్యాధికారి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నోటీస్ విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రవేట్ ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాల ప్రాంగణంలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైన వాటిని విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. పై ఆదేశాల ప్రకారం జిల్లాలోని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఇన్స్ పెక్టర్లు ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తారని, వారి కంటే ముందే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని తెలిపారు.

జిల్లాలో నడుస్తున్న స్టేట్, సీబీఎస్సీ, ఐసీఎస్ఈ పాఠశాల ప్రాంగణంలో యూనిఫారాలు, షూ, బెల్ట్ లాంటి విక్రయాలు జరపకూడదు అని, కోర్డు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్ లలో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు జరపవద్దని, అలాంటివి ఏవైనా ఉంటే అవి వాణిజ్యేతర, లాభపేక్ష, నో-లాస్ ప్రతిపాధికన ఉండాలని అన్నారు. వీటిని ఉల్లంఘించిన పాఠశాలలకు తక్షణమే నోటీసులు జారీ చేయబడతాయని హెచ్చరించారు. అంతేగాక ప్రైవేట్ పాఠశాలలను ఎల్లప్పుడూ పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని నోటీసులో స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed