తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం.. ఆ ఎంపీ స్థానానికి భారీగా నామినేషన్లు

by Disha Web Desk 13 |
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం.. ఆ ఎంపీ స్థానానికి భారీగా నామినేషన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది.నాలుగో దశ ఎన్నికల కోసం నామినేషన్ల గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉతెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం.. ఆ ఎంపీ స్థానానికి భారీగా నామినేషన్లుప ఎన్నికకు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో క్యూలో ఉన్న వారికి నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 18వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.

ఈసీఐ వెబ్ సైట్ లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం నియోజకవర్గాల వారిగా దాఖలైన నామినేషన్లు:

ఆదిలాబాద్- 39

భువనగిరి- 81

చేవెళ్ల-59

హైదరాబాద్-48

కరీంనగర్-69

ఖమ్మం-57

మహబూబాబాద్-32

మహబూబ్ నగర్-42

మల్కాజిగిరి-101

మెదక్-55

నాగర్ కర్నూల్-23

నల్గొండ-85

నిజామాబాద్-77

పెద్దపల్లి-74

సికింద్రాబాద్-60

వరంగల్-62

జహీరాబాద్-41

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బై పోల్ కు:38



Next Story

Most Viewed