మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు నో సెక్యూరిటీ.. పోలీసుల తీరుపై విమర్శలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-20 06:46:27.0  )
మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు నో సెక్యూరిటీ.. పోలీసుల తీరుపై విమర్శలు
X

దిశ, పలిమెల: మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న పలిమెల మండలంలోనీ పలు గ్రామాల్లో మాజీమంత్రి మంత్రి, శాసనసభ్యులు శ్రీధర్ బాబు అర్ధరాత్రి పర్యటించారు. పలిమెల మండలంలోని సర్వాయిపేట లెంకలగడ్డ పెద్దముపేట, బొడ్రాయి గూడెం నీలంపల్లీ, బూర్గు గూడెం, దమ్ముర్ పంకేన , పలిమెల గ్రామాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. శ్రీధర్ బాబు పర్యటన సందర్భంగా పోలీసులు కేవలం ఆరు గంటల వరకు మాత్రమే ఆయన వెంట ఉండి అనంతరం నిష్క్రమించారు. తాము భద్రత కల్పించలేమంటూ పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. అయినా ముకునూర్ గ్రామంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో అక్కడి విద్యార్థులతో కలిసి శ్రీధర్ బాబు నిద్ర పోయారు. గ్రామంలో విద్యార్థుల సమస్యలు తెలుసుకుని ఉన్నత చదువులు చదివి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని వారికి సూచించారు. పలిమెల మండలంలోని పలు గ్రామాల్లో నిరుద్యోగ యువకులకుతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రకటన చేసిందని, దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువకులకు మంథని నియోజకవర్గంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

అందుకు అవసరమైన వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమ ఆధ్వర్యంలో ఎలాంటి ఖర్చులేకుండా 60 రోజుల పాటు నిపుణులైన వారిచే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. శాసనసభ్యులు శ్రీధర్ బాబు అర్ధరాత్రి గ్రామాల్లో పర్యటించడంతో గ్రామస్తులు సైతం పరేషన్ అయ్యారు. నిత్యం ఆ గ్రామాల్లో మావోయిస్టులు తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమయంలో ముకునూరు నీలంపల్లి దమ్ముర్ గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పోలీసులు అనుమతి ఇవ్వకుండా గ్రామాల్లో నిర్భయంగా పర్యటించి శ్రీధర్ బాబు ప్రజల్లో తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం సేవించారు. . ఆయన వెంట పలుమెల ఎంపిపి కురుసం బుజ్జక్క, మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ మండలాధ్యక్షుడు చిన్నన్న, అంబట్ పల్లి సర్పంచ్ యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి విలాస రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు చీమల సందీప్ అశోక్ రాజీర్, కాంగ్రెస్ నాయకుడు చిలుముల వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed