తెలంగాణలో అమ్మాయిలకు రక్షణ లేదు : RSP

by Nagaya |   ( Updated:2022-12-09 12:40:56.0  )
తెలంగాణలో అమ్మాయిలకు రక్షణ లేదు : RSP
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన విచ్చలవిడిగా పెరిగిన బెల్ట్ షాపుల్లో దొరికే మద్యం తాగి మత్తులో యువత చెడు దారి పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలంలోని తిరుమలగిరిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక జయశ్రీ కుటుంబాన్ని పరామర్శించారు. రాబోయే కాలంలో సివిల్స్ రాసి ఉన్నత ఉద్యోగం చేయాల్సిన అమ్మాయి అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం ప్రభుత్వమేనని ఆరోపించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉండగా, అధికారులతో మాట్లాడి పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. పట్టపగలు కూడా ఆ తండాలో పిల్లలు బడికి వెళ్ళడానికి భయపడుతున్నారని, కుటుంబ సభ్యులు వెంట లేకపోతే పిల్లలు బయటకు వెళ్లే పరిస్థితి లేదని బాధితురాలి తల్లి విలపిస్తుందని పేర్కొన్నారు. బహుజన రాజ్యంలో బెల్ట్ షాపులను రద్దు చేస్తామని ప్రకటించారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, మహిళా కన్వీనర్ రాములమ్మ, జడ్చర్ల అసెంబ్లీ అధ్యక్షుడు లీడర్ శ్రీను, నియోజకవర్గ ఇంచార్జి బాలవర్ధన్ గౌడ్, మండల నాయకులు యాదయ్య, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story