అనుమతులు ఉన్న వారికి ఆందోళన అనవసరం : హైడ్రా

by Y. Venkata Narasimha Reddy |
అనుమతులు ఉన్న వారికి ఆందోళన అనవసరం : హైడ్రా
X

దిశ, వెబ్ డెస్క్ : ఆక్రమిత నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలకప్రకటన చేసింది. హైదరాబాద్ లోని బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో ఆక్రమణలకు గురైన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రామా కూల్చివేతపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నక్రమంలో హైడ్రా వివరణ ఇచ్చింది.అనుమతులు ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని ఎక్స్ లో పోస్టు పెట్టింది. చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ల వారు, నిర్మాణదారులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

చెరువులు, కుంటల సమీపంలో అన్ని అనుమతులున్న నిర్మాణాలను కూడా కూల్చివేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించింది. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న ఏ నిర్మాణాన్ని కూల్చివేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారని పేర్కొంది. హైడ్రా ఈ ఆదేశానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందని ట్విటర్ వేదికగా వెల్లడించింది.

Advertisement

Next Story