- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులకు రుణమాఫీ చేయడంపై మంత్రి తుమ్మల క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియను షూరు చేసింది. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్‌ను విడుదల చేసిన సర్కార్.. తాజాగా అర్హులైన రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 18వ తేదీ నుండి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపింది. ఈ క్రమంలో రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో మంత్రి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులకు రుణమాఫీ ఉండదని తేల్చి చెప్పారు.
ఇక, రేషన్ కార్డు నిబంధనపై నెలకొన్న గందరగోళానికి కూడా మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు. అర్హులైతే రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు కేవలం రైతు కుటుంబ నిర్ధారణ కోసం మాత్రమేనని పేర్కొన్నారు. మొత్తం రుణమాఫీ లబ్ధిదారులు 40 లక్షల మంది ఉన్నారని.. అందులో కేవలం 6 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని వెల్లడించారు. రుణమాఫీకి మొత్తం రూ.31 వేల కోట్లు అవసరమని తెలిపారు. ఈ నెల 18 నుండి రుణమాఫీ ప్రాసెస్ మొదలు పెట్టి విడతల వారీగా ఆగస్ట్ 15లోపు మొత్తం ప్రక్రియను కంప్లీట్ చేస్తామని స్పష్టం చేశారు.