అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు నో ఇన్విటేషన్.. తమిళిసై రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు నో ఇన్విటేషన్.. తమిళిసై రియాక్షన్ ఇదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ట్యాంక్ బండ్ వద్ద విగ్రహావిష్కరణకు తనకు ఆహ్వానం అందలేదన్నారు. ఇన్విటేషన్ ఉంటే తప్పకుండా ఈ ప్రోగ్రామ్‌కు అటెండ్ అయ్యేదాన్ని అని చెప్పారు. అంబేద్కర్ ఎక్కువగా మహిళల హక్కుల గురించి మాట్లాడారని అలాంటిది మహిళా గవర్నర్‌కు ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి పిలుపు లేకపోవడంతో రాజ్ భవన్‌లోనే అంబేద్కర్‌కు నివాళులు అర్పించానని చెప్పారు. కాగా గత కొంత కాలంగా రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. పలు అంశాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అనేలా పరిస్థితులు ఉన్నాయి. అయితే రాజకీయ కోణంలో ఎలా ఉన్నా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed