15 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్‌కు ‘నో’ డిపాజిట్.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Rajesh |
15 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్‌కు ‘నో’ డిపాజిట్.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ :15 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్‌కు ‘నో’ డిపాజిట్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రులు ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవన్నారు. కేసీఆర్ విద్యుత్ ఉత్పత్పిని పెంచినట్లు చెప్పడంలో వాస్తవం లేదన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు పాత సాంకేతికత వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తానని కేసీఆర్ చెప్పడంలో అర్థం లేదన్నారు. మేడిగడ్డ కుంగితే అధికారంలో ఉన్నప్పుడే ఎందుకు మరమ్మతు చేయలేదని ప్రశ్నించారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పచ్చి అబద్ధాలు చేప్పారని ఉత్తమ్ అరోపించారు. కమీషన్ల కక్కుర్తితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్నారు. 17 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాదని మంత్రి జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed