- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ కీలక నేతకు BIG షాక్.. సంక్రాంతి తర్వాత ముహూర్తం పెట్టిన కాంగ్రెస్!
దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు షాకిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. పుట్ట మధుపై అవిశ్వాసం పెట్టే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 8 మంది జెడ్పీటీసీల మద్దతు లభించింది. రేపు(శుక్రవారం) లేదా సంక్రాంతి పండుగ తర్వాత అవిశ్వాసం పెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. కాగా, 2019లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలో 13 మండలాలకు గాను.. బీఆర్ఎస్ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు జెడ్పీటీసీలు గెలిచారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు ఓదెల కాంగ్రెస్ జెడ్పీటీసీ గంట రాములు బీఆర్ఎస్‌లో చేరగా.. పాలకుర్తి బీఆర్ఎస్ జెడ్పీటీసీ సంధ్యారాణి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఉన్న 13 మంది జెడ్పీటీసీల్లో మెజార్టీ సభ్యులు పుట్ట మధుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాణానికి ఓటు వేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ అంశానికి తెరపడనుంది.