- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పాత పెన్షన్ అమలుపై నిర్ణయం తీసుకోండి'
దిశ, తెలంగాణ బ్యూరో: పాత పెన్షన్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని ఎన్ఎంవోపీఎస్ నేతలు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 2004 నుంచి నియమితులైన 1.70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ సీపీయస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు, దేశ వ్యాప్తంగా ఉన్న 84 లక్షల మంది ఉద్యోగుల సామాజిక భద్రత లోపించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. దీనిపై భారత్ రాష్ట్ర సమితి పరంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. దేశంలో ఇటీవల జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, సిక్కిం క్రాంతి కారి మోర్చా, జనతా కాంగ్రెస్‌లు దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో సీపీయస్ రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు. భారత రాష్ట్ర సమితి కూడా ఉద్యోగుల సంక్షేమం పట్ల నిర్ణయం తీసుకోవాలని కోరారు. తప్పకుండా దేశ వ్యాప్తంగా ఈ నూతన పెన్షన్ విధానాన్ని అధ్యయనం చేసి పాత పెన్షన్ల అమలుపై పార్టీ పరంగా విధాన నిర్ణయం పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ, తెలంగాణ రాష్ట్ర కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్గౌడ్లు ఉన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఏర్పాటు, జాతీయ విస్తరణ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు.