మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-13 16:01:53.0  )
మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల వైద్యులపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణకు ప్రత్యేకంగా పాలసీని రూపొందించాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ సూచించింది. ఈ మేరకు మంగళవారం అన్ని మెడికల్‌ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఓపీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టళ్లు, క్యాంపస్‌లోని ఇతర ప్రదేశాలు, రెసిడెన్షియల్‌ క్వార్టర్లలో రక్షణ చర్యలు చేపట్టాలని కోరింది. వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు ఎక్కువగా సంచరించే అన్ని ప్రాతాల్లో సీసీటీవీలను బిగించాలని స్పష్టం చేసింది. తగినంత మంది పురుష, మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించాలని సూచించింది. ఎవరైనా వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే వెంటనే కాలేజీ యాజమాన్యం స్పందించి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనలపై 48 గంటల్లోగా సమగ్ర వివరాలతో నివేదికను ఎన్‌ఎంసీకి పంపాలని సూచించింది.

Advertisement

Next Story