- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పండగపూట విషాదం..
by Sumithra |

X
దిశ, కామారెడ్డి రూరల్ : రోజు మాదిరిగానే పొలంలో పనులకు వెళ్లిన ఓ యువ రైతు ప్రమాదవశాత్తు పొలంలో జారిపడి మృతి చెందిన సంఘటన కామారెడ్డి మండలం అడ్డూర్ లో చోటు చేసుకుంది. దేవునిపల్లి పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఒడిశెట్టి కృష్ణ (35) అనే యువ రైతు వరి పొలంలో పని చేయడానికి వెళ్లాడు.
పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పొలంలో జారిపడి అక్కడికక్కడ మృతి చెందాడని తెలిపారు. బతుకమ్మ పండుగ రోజు మృతి చెందడంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story