మంచేదో చెడేదో ఆలోచన చెయ్యాలి

by Sridhar Babu |   ( Updated:2023-11-16 15:51:55.0  )
మంచేదో చెడేదో ఆలోచన చెయ్యాలి
X

దిశ, భిక్కనూరు : మంచేదో చెడేదో ఒకసారి ఆలోచించాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని తమ పార్టీకి ఓటెయ్యాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం భిక్కనూరు మండలం తిప్పాపూర్, మోటాట్ పల్లి, రామేశ్వర్ పల్లి, సిద్ధ రామేశ్వర నగర్, గుర్జకుంట, ర్యాగట్లపల్లి గ్రామాల్లో సీఎం కేసీఆర్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని అన్నాడని, ఆయనకు వ్యవసాయం గురించి ఏం తెలుసని అన్నారు. మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ వాళ్లు కావాలా, మూడు పంటలకు 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా ఆలోచించాలని సూచించారు. తెలంగాణ మలిదశ

ఉద్యమంలో ప్రజల అభిష్టాన్ని కాంక్షించి తాను పదవికి రాజీనామా చేశానని, తనతోపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయకుండా బెంగళూరు కు పారిపోయాడని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్ రెడ్డి, ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, రైతుబంధు సేవా సమితి చైర్మన్ బోండ్ల రామచంద్రం, డీసీసీబీ డైరెక్టర్లు లింగాల కిష్టా గౌడ్, గోండ్ల సిద్ధ రాములు, సర్పంచులు తునికి వేణు, కోకా స్వామి,మొటాటి రాజేశ్వరి, నాగర్తి పోతిరెడ్డి, జనగామ శ్రీనివాస్, కందడి మనోహర రమేష్ రెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దాయారి సాయి రెడ్డి, సొసైటీ చైర్మన్లు ఏనుగు వెంకట్ రెడ్డి, నాగర్తి భూంరెడ్డి, బోయిన మాధవి బలరాం, ద్యావరలక్ష్మి, తక్కల్ల నర్సారెడ్డి, తక్కళ్ల రవీందర్ రెడ్డి, బాణాల అమృత రెడ్డి, మల్లేష్ మల్లారెడ్డి, బుర్రి గోపాల్, బుర్రి రంజిత్ వర్మ, అమరావతి సిద్ధరాంరెడ్డి, కర్నాల మల్లేశం, అంబల్ల మల్లేశం, తుడుం స్వామి, వెంకమ్మ గారి బస్వయ్య, పొగుడ శ్రీనివాస్, సామల భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed