- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధిని చూసే చేరికలు.. ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్..
దిశ, భిక్కనూరు : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన వడ్ల కమ్మర్లు కామారెడ్డిలోని ఆయన నివాసానికి వెళ్లి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బీఆర్ఎస్ గ్రామాలను అభివృద్ధిపరిచిందన్నారు. ఏ గ్రామంలోనూ మట్టిరోడ్లు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు.
అనంతరం వడ్లకమ్మర్ల సంఘం భవనానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మండలశాఖ అధ్యక్షులు పెద్ద బచ్చ గారి నర్సింహారెడ్డి, ఆలయ పున:నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, భిక్కనూరు ఉపసర్పంచ్ బోడ నరేష్, పట్టణ మాజీ సర్పంచ్ తాటిపాముల నాగభూషణం గౌడ్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ డైరెక్టర్ వెంకమ్మ గారి బస్వయ్య, కో ఆప్షన్ సభ్యులు రాయిని గారి శ్రీనివాస్, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంబల్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.