- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల భరోసాకు ఉమెన్స్ హెల్ప్ డెస్క్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పోలిస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు రోజుల పాటు ఉమెన్స్ హెల్ప్ డెస్క్ శిక్షణను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కే ఆర్ నాగరాజు ప్రారంభించారు. శుక్రవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో ఈ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళ రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అపథలో, సంక్షోభంలో ఉన్న పిల్లలను గురించి చైల్డ్ లైన్ 1098 కు సమాచారం అందించి సంప్రదించాలని, మహిళలు, పిల్లలు ఏ విధమైన హింసకు గురైన ఉమెన్ హెల్ప్ లైన్ 181 ను సంప్రదించాలని కోరారు. మహిళల భరోసాకు ఉమెన్స్ హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణలో 2020 నుంచి మహిళలపై నేరాలు 17791, పిల్లలపై నేరాలు 4,200 లుగా నమోదు అయ్యాయని తెలిపారు. ముఖ్యంగా ఇప్పటికి మహిళలు ఇంటిలోనే వేధింపులకు 498ఏ కేసులో భాధించబడుతున్నారని అన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్ లు, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తున్నామని అన్నారు. రెండు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకుని పోలిస్ స్టేషన్‌లో అందరికి సేవలంధించాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిసిపి అరవింద్ బాబు, కామారెడ్డి అదనపు ఎస్పీ అన్యోన్య, అదనపు ఎస్పీ రాజారత్నం, జిల్లా సంక్షేమ అధికారిని సుధారాణి, జిల్లా మహిళా సంక్షేమాధికారి స్వప్న, మహిళ సెప్టి సిఐ రేణుక, రైల్వే ఎస్ఐ జ్యోత్స్న, ఎసిపిలు, సిఐలు, ఎస్ఐలు, రిసెప్షనిస్ట్‌లు పాల్గోన్నారు.
- Tags
- nizamabad