అల్జాపూర్ శ్రీనివాస్ పై వేటు... ?

by Naresh |
అల్జాపూర్ శ్రీనివాస్ పై వేటు... ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్ పార్లమెంట్ సీటు కోసం బీజేపీలో జరుగుతున్న అసమ్మతి సెగల పై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గంలో పాటు హైదరాబాదులోనూ ఫిర్యాదులు, నిరసన కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మొదటి నుంచి బహిరంగ వేదికలపై విమర్శనాస్త్రాలు చేస్తున్న బీజేపీ సీనియర్ నాయకులు ఆదిలాబాద్ జిల్లా ప్రబారి అల్జాపూర్ శ్రీనివాస్ పై బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా ఎంపీ అరవిందును టార్గెట్ చేస్తూ ఆర్మూర్, కోరుట్ల మెట్పల్లి జగిత్యాల ప్రాంతాల్లో నిరసనలు, దిష్టిబొమ్మ దహనం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఒక కార్యకర్త బీజేపీ కార్యాలయంలో ఆత్మహత్యయత్నానికి సిద్ధపడటం పై పార్టీ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. పార్లమెంట్ సీట్ల విషయంలో ఇప్పటికి జాతీయ పార్టీ, రాష్ట్ర నాయకత్వం గానీ ఇలాంటి ప్రకటన చేయకుండానే బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని ప్రకటించుకున్నారు.

అంతేగాకుండా సిట్టింగ్ ఎంపీ పైనే విమర్శనాస్త్రాలు, ఆరోపణస్త్రాలు సంధించారు. ఈ విషయంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆయన పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోని అల్జాపూర్ శ్రీనివాస్ పై చర్యలు తీసుకునేందుకు పార్టీ అగ్ర నాయకత్వం సిద్ధపడినట్లు తెలిసింది. రేపు మాపో ఈ మేరకు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed