- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం
దిశ, కామారెడ్డి : నిద్రపోకుండా పహారా కాసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని, వచ్చే నెల 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఎన్నికలు పూర్తయ్యాక నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడకొట్టి నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఓటమి అంచున ఉన్నప్పుడల్లా కేసీఆర్ స్థానాలు మార్చాడని గుర్తు చేశారు. మావాళ్లు వల వేసి ఆయనను ఇక్కడ ఓడగొట్టడం అభినందనీయమన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వారిని ప్రజలు ఓడించారన్నారు. శ్రీకాంతాచారి ఆత్మకు ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాంతాచారి డిసెంబర్ 3న తన తుదిశ్వాస వదిలాడని, ఆరోజే ఎన్నికల ఫలితం రానుందన్నారు. సమాజంలోని చైతన్యం పై మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఎవరెన్ని రకాలుగా వారించినా పోరాడామన్నారు. ఎక్సిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు
అధికారం రాదని చెప్పడం లేదని, స్థానాలు కొన్ని మారుతాయని మాత్రమే చెబుతున్నాయన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా లేవని కేసీఆర్ మీడియా ముందుకు రాలేదన్నారు. ఇవ్వాళ చంద్రుడికి మబ్బులు పట్టాయన్నారు. ఎక్సిట్ పోల్స్ తప్పంటున్నావు కదా.. ఒకవేళ అవి నిజమైతే నువ్వు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్తావా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఈరోజు 7 గంటల నుండే విజయోత్సవాలు జరుపుకోండని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షం, పాలక పక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కేసీఆర్ గెలిస్తే రాజు, ఓడితే బానిస అనేలా పనిచేశారన్నారు. కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు విశ్వాసం కల్పిస్తుందన్నారు. మీడియాకు కూడా ఈరోజు నుండి స్వేచ్ఛ లభిస్తుందన్నారు. తాము పాలకులం కాదు.. సేవకులం అని పేర్కొన్నారు. 4 కోట్ల మంది ప్రజలు మనకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారన్నారు. మనకు మొదటి, చివరి శత్రువు కేసీఆర్ కుటుంబంలోని నలుగురే అన్నారు. బీఆరెఎస్ పార్టీకి 25 సీట్లు కూడా దాటవు అన్నారు. సమావేశంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.