ముస్లిం రిజర్వేషన్లను తొలగించి దళిత గిరిజనులకు పెంచుతాం

by Disha Web Desk 15 |
ముస్లిం రిజర్వేషన్లను తొలగించి దళిత గిరిజనులకు పెంచుతాం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దేశంలో ఒక మతం ప్రతిపాదికంగా ఇచ్చే రిజర్వేషన్ లు చెల్లవని సుప్రీం కోర్టు ఎన్నడో చెప్పిందని, దేశ హోం మంత్రి అమిత్ షా చాలా బహిరంగ సభల్లో ముస్లింలకు రిజర్వేషన్ లు తీసివేస్తామని ప్రకటించారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో అరవింద్ మాట్లాడారు. బీజేపీపై చార్జిషీట్ వేసేంత స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును జూన్ 24న వెలువరించనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అన్నారు. కోర్టు తీర్పులో రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిపెస్టో భయంకరంగా ఉందన్నారు.

నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అదే చెప్పాడని, నేడు రాహుల్ గాంధీ దానిని వల్లె వేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ భారత్ ను తాలిబన్ లకు అడ్డాగా మారుస్తారని ఆరోపించారు. ప్రపంచంలో భారత అర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉంటేనే దేశం పురోగతి ఈ విధంగా ఉందని, మరోసారి మోడీ ప్రధాని అయితే దేశం మూడోస్థానంలోకి వస్తే అభివృద్ధి ఉహించలేమని అన్నారు. ప్రపంచంలో ముస్లిం దేశాలలో దేవాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. రుణమాఫీ విషయంలో డిసెంబర్ 25 ఏమైందని, కొత్తగా సెప్టెంబర్ 17 సంగతేమిటని ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఇంధన ధరలు మండిపోతున్నాయని, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా పెట్రోల్, డిజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఎవరెన్ని ఎత్తులు వేసినా ప్రజలు కమలం పార్టీకి పట్టం కడతారని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed