పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాం

by Sridhar Babu |
పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాం
X

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ గున్కల్ సొసైటీ కళ్యాణ మండపంలో జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ఆయన 234 మందికి కళ్యాణ లక్ష్మి, 95 మందికి షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు.

మొన్న జరిగిన చేవెళ్ల సభలో రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించామని, అతి త్వరలోనే రైతులకు రుణ మాఫీ చేస్తామని, అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇచ్చే పథకాన్ని కూడా అమలు చేస్తామని తెలియజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. హన్మంత్ షిండే పదిహేనేళ్లు ఎమ్మెల్యే గా పని చేసి జుక్కల్ ను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని, నియోజకవర్గంలో రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్ ఇలా ఏవి చూసినా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిచ్కుందలో ఎలక్షన్స్ కు ముందు హడావిడిగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని, రోడ్డు తవ్వి వదిలేయడంతో రోడ్డు పక్కన షాపులు నడుపుకుంటున్న వారు, రోడ్ల మీద వెళ్లే ప్రజలు దుమ్ము ధూళితో నానా అవస్థలు పడుతున్నారని అన్నారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించానని, అతి త్వరలోనే పనులు మొదలవుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం విఫలం అయ్యిందని, జుక్కల్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సర్వే చేసి చూస్తే ప్రజలకు తాగు నీరు అందించడానికి సుమారు 500 బోర్లు వేయాల్సి వస్తోందని తెలిపారు. అయినప్పటికీ ఎండాకాలంలో ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చీకోటి జయ ప్రదీప్, మాజీ వైస్ ఎంపీపీ మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య గారి ఆకాష్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు నోకియా నాయక్, గజ్జల రాములు, మాజీ సర్పంచ్ సవాయి సింగ్, కాలేక్, అనీస్ పటేల్, జమీల్, రాజా గౌడ్, నాగభూషణం,ప్రజా పండరి,సంతోష్ నాయక్, రాథోడ్ రాము, మాజీ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్,గంగి రమేష్, గాండ్ల రమేష్, గొట్టం నరసింహులు, నియోజకవర్గంలోని మండలాల తహసీల్దార్లు, భిక్షపతి, క్రాంతి కుమార్, వేణుగోపాల్, హిమబిందు, రేణుక చౌహాన్, దశరథ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చందూరి అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story