నాలాపై నిర్మించిన కట్టడాలు కూల్చివేత

by Sridhar Babu |
నాలాపై నిర్మించిన కట్టడాలు కూల్చివేత
X

దిశ, ఘట్కేసర్ : నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని ఘట్కేసర్ ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్వర్ అన్నారు. ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో మైసమ్మ గుట్ట సమీపంలో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను బుధవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ మాట్లాడుతూ నాలాలున్నచోట నిర్మాణాలు చేపట్టాలనుకుంటే ముందస్తుగా నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed