నిజాంసాగర్ ప్రధాన కాలువ నుండి నీటి విడుదల

by Sridhar Babu |
నిజాంసాగర్ ప్రధాన కాలువ నుండి నీటి విడుదల
X

దిశ,నిజాంసాగర్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు, రైతుల జల ప్రధాయిని నిజాంసాగర్ జలాశయం నుంచి యాసంగి పంటల సాగు కోసం నాలుగో విడత నీటిని విడుదల చేశామని నీటిపారుదల శాఖ ఏఈఈ శివ ప్రసాద్ తెలిపారు. పంటల సాగు కోసం జలవిద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 1700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని ఆయన తెలిపారు.

10 రోజులు ఆన్10 రోజులు ఆఫ్ ప్రతిపాదికన కొనసాగుతుందని, రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1400 అడుగులు11.8891 టీఎంసీలు నీరు నిలువ ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా వరద నీటి ప్రవాహం ఎక్కువగా కొనసాగే నేపథ్యంలో ప్రవాహంలోకి పశువులు, గొర్రెలు దిగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

Next Story