- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జిల్లా కేంద్రంలో మొక్కజొన్న పరిశోధన శాస్త్రవేత్తల సందర్శన
దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సదాశివ నగర్, గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం మొక్కజొన్న పంట పొలాల క్షేత్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన శాస్త్రవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో మొక్కజొన్న సంపద చాలా గణనీయంగా ఉందని అన్నారు. ఈ క్షేత్ర సందర్శనలో భాగంగా మొక్కజొన్న పంట ప్రస్తుత వానాకాలంలో ఎదురుకుంటున్న సమస్యలను రైతులు శాస్త్రవేత్తల దృష్టికి తీసుకువచ్చారు.
మొక్కజొన్నలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులను, అలాగే ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం గురించి ప్రధాన శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కూలంకషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే. నగేష్, మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లయ్య, వ్యాధి నిర్ధారణ విభాగం శాస్త్రవేత్త, కరీంనగర్ మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రావణి డాక్టర్ రాజేంద్రప్రసాద్, పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్. ఓం ప్రకాష్, నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. నవీన్ కుమార్, కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మి, ఎల్లారెడ్డి డివిజన్ ఏడీఏ రత్న, గాంధారి మండలం వ్యవసాయ అధికారి నరేష్, సదాశివ్ నగర్ మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో ఈ సందర్శనను నిర్వహించారు.
అంతే కాక ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కరుణాకర్, సదాశివనగర్ మండలం వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు గ్రామ రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు, రైతు బంధు సమితి సభ్యులు, మొక్కజొన్న విత్తనాన్ని సరఫరా చేసిన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 35 మంది రైతులు పాల్గొన్నారు.