రాష్ట్ర మంత్రి సీతక్కను కలిసిన వినయ్ రెడ్డి..

by Sumithra |
రాష్ట్ర మంత్రి సీతక్కను కలిసిన వినయ్ రెడ్డి..
X

దిశ, ఆర్మూర్ : తెలంగాణ పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అనసూయ సీత‌క్క‌ను ఆదివారం ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హైదరాబాదులో కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి 1.25 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గంలోని నందిపేట్ మండలం కౌల్‌పూర్‌ గ్రామంలో ఎస్సీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పొడిగింపుకి 50 లక్షల రూపాయలు, మండల కేంద్రంలోని గౌడ ఫంక్షన్ హాల్ కోసం 25 లక్షల రూపాయలు, పద్మశాలి ఫంక్షన్ హాల్ కోసం 25 లక్షల రూపాయలు, మండల కేంద్రంలో మైనారిటీ ఫంక్షన్ హాల్ కోసం 25 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన మంత్రికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరఫున వినయ్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story