- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిచ్కుంద ఇంటర్ కాలేజీలో జోరుగా మాల్ ప్రాక్టీస్..
దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జోరుగా మాల్ ప్రాక్టీస్ కొనసాగుతుందని పాఠాలు చెప్పాల్సిన లెక్చరలే మాల్ ప్రాక్టీస్కి అన్నివిధాలుగా సహకరిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ బిచ్కుంద శాఖ ఆరోపించింది. ఈ సందర్భంగా వ్యవస్థ ప్రముఖ్ ముప్పిడి వెంకట్ మాట్లాడుతూ భావితరాలకు పాఠాలు బోధించి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు ప్రతి విద్యార్థికి 35 నుంచి 40 మార్కులు డిక్టేషన్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
దీంతోపాటు కళాశాల ప్రిన్సిపాల్ అయిన నరేందర్ వివిధ కళాశాలల నుండి తమ సెంటర్లో ఉన్న విద్యార్థులకు మాల్ ప్రాక్టీస్ కి సహకరించుటకిగాను ఇతర కళాశాల నుండి ఫిక్స్డ్ అమౌంట్ రూపేనా కాసులపై కక్కుర్తి పడ్డారని ఏబీవీపీ ఆరోపించింది ఇప్పటికైనా బిచ్కుంద కళాశాల సెంటర్ పై దృష్టిసారించి పరీక్షా విధానాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఏబీవీపీ బిచ్కుంద శాఖ ద్వారాడిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో వ్యవస్థా ప్రముఖ్ ముప్పిడి వెంకట్, జగడం సాయిలు రాహుల్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.