ప్రమాదంలో పశువైద్యశాల..బిక్కుబిక్కుమంటున్న సిబ్బంది

by Aamani |
ప్రమాదంలో పశువైద్యశాల..బిక్కుబిక్కుమంటున్న  సిబ్బంది
X

దిశ, కోటగిరి : ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి కోటగిరి మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో నెలకొంది. పశువైద్యశాల భవనం పూర్తిగా శిథిలా వ్యవస్థ చేరుకోవడంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి పశువైద్యశాల భవనం స్లాబ్ పై నీరు ఆగడంతో భవనం లోపల భాగంలో పై పెచ్చులూడి పోవడంతో పాటు ఎప్పుడైనా స్లాబ్ కూలిపోయే ప్రమాదం నెలకొంది. దీనితో పాటు కొన్ని ఏండ్ల క్రితం రోడ్డు వెడల్పు లో భాగంగా ప్రధాన రహదారి ఎత్తు పెంచడంతో పశువైద్యశాల భవనం ప్రధాన రహదారి కంటే క్రిందకు కావడంతో వర్షం నీరు వైద్య శాల ఆవరణలో చేరడంతో ఆవరణం అంత బురద మయంగా మారుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక సిబ్బంది బిక్కు బిక్కు మంటూ ప్రమాదంలోనే తమ విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే పై అధికారులు స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed