అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి

by Naresh |   ( Updated:2024-01-19 15:22:33.0  )
అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి
X

దిశ, భిక్కనూరు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమి అన్యాక్రాంత మైందని, తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహులు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కామారెడ్డి జిల్లాలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు, భిక్కనూరు మండలం జంగంపల్లిలోని పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి కరెంట్ సౌకర్యం కల్పించడంతో పాటు, నీటి వసతిని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే వినతిపత్రం తీసుకున్న మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించాడని, పక్షం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని, పరిష్కారం కాని పక్షంలో ఆ తర్వాత మళ్లీ వచ్చి కలవాలని మంత్రి పొంగులేటి చెప్పాడని వారు వివరించారు. మంత్రి పొంగులేటిని కలిసిన వారిలో కొంగ సత్యనారాయణ, మాడుగుల ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed