ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకల్లో అర్బన్ బీఆర్ఎస్ నేతలు దూరం

by Sridhar Babu |
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకల్లో అర్బన్ బీఆర్ఎస్ నేతలు దూరం
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో కొద్దిపాటి నేతల సమక్షంలో బీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షులు సిర్పా రాజు ఆధ్వర్యంలో జరిగాయి. పలువురు నేతలు దూరంగా ఉన్నారు. కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అయితే జన్మదిన వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవితను మాజీ ఎమ్మెల్సీగా ముద్రించడం పట్ల కొద్దిసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత తేరుకున్న ఆ పార్టీ నాయకులు మాజీగా ముద్రించిన స్థలంలో ఓ పేపర్ని అతికించి తప్పును సవరించుకున్నారు.

Advertisement

Next Story