Gautam Ghattamaneni : అమెరికాలో ఫ్రెండ్స్‌‌తో సరదాగా గడుపుతోన్న పిక్స్ షేర్ చేసిన సూపర్‌స్టార్ తనయుడు

by Anjali |
Gautam Ghattamaneni : అమెరికాలో ఫ్రెండ్స్‌‌తో సరదాగా గడుపుతోన్న పిక్స్ షేర్ చేసిన సూపర్‌స్టార్ తనయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ గురించి తెలిసిందే. ప్రిన్స్ సతీమణి పిల్లల గురించి అప్‌డేట్స్ కానీ.. వెకేషన్స్ కు వెళ్లినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు సితార-గౌతమ్‌కే సోషల్ మీడియా అకౌంట్లు ఉండటంతో వారే వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే గౌతమ్ బాబు ప్రజెంట్ న్యూయార్క్‌లో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా గౌతమ్ తన తోటి స్నేహితులతో సరదాగా గడుపుతోన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ పిక్స్ కు గౌతమ్ ‘లిమిట్ యూనివర్సిటీ పార్ట్ -4’ అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే గౌతమ్ తండ్రి మహేష్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed