ట్రాక్టర్ కు నిప్పు పెట్టిన దుండగులు..

by Sumithra |
ట్రాక్టర్ కు నిప్పు పెట్టిన దుండగులు..
X

దిశ, భిక్కనూరు : వ్యవసాయ బావి వద్ద నిలిపి ఉంచిన ట్రాక్టర్ ను గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బుధవారం వేకువ జామున చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన ఆకుతోట దేవానంద్ తన వ్యవసాయ బావి వద్ద ట్రాక్టర్ ను నిలిపిఉంచారు. బుధవారం ఉదయం ఎప్పటి లాగే వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా ట్రాక్టర్ దగ్ధమై ఉంది.

ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోగా ఇంజన్ భాగం కూడా దెబ్బతింది. ఎవరో కావాలనే మనసులో కక్ష పెట్టుకొని ట్రాక్టర్ దగ్ధం చేశారన్న అనుమానాన్ని బాధితుడు వ్యక్తం చేశాడు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేసి అనుమానితుని పేర్లను సైతం ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా ట్రాక్టర్ దగ్ధం చేసిన ఘటనలో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దగ్దమైన ట్రాక్టర్ విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed