- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశం క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడగలిగింది..కేంద్రమంత్రి
దిశ, భిక్కనూరు : క్లిష్ట పరిస్థితుల నుంచి దేశాన్ని సమర్థవంతంగా బయటపడగలిగేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపలా అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని పాకనాటి రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ లో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో మూడు సంకట పరిస్థితులను దేశం ఎదుర్కొందన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. సొంతంగా వ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేసిన ఘనత కూడా కేంద్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం వలన భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాలకు పాకిందన్నారు.
ముఖ్యంగా రష్యా ఉక్రెన్ ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో 20,000 మంది విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా దేశానికి తరలించిన ఘనత మోడీ ప్రభుత్వ చొరవేనన్నారు. భారత్ చైనా సరిహద్దు విషయమై వివాదం చెలరేగగా ఆ అంశాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టగలిగామని, ఆ విషయమై ప్రపంచ దేశాలు మెచ్చుకొని, భారతదేశం చూసే విధంగా చేసిన ఘనత మోడీకి దక్కిందన్నారు. ఒకప్పుడు ప్రధాని మోడికి వీసా ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన అమెరికానే, నేడు ప్రధాని మోడీకి ఘన స్వాగతంపలికే స్థాయికి వెళ్లిందంటే అది మోడీ గొప్పతనం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయన్నారు. దాదాపుగా ఈ శ్రీరామనవమి లోపు అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవుతుందన్నారు. అంతకుముందు సోషల్ మీడియా విభాగం ప్రతినిధులతో మాట్లాడిన ఆయన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ చేపడుతున్న కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎంత తొందరగా అప్లోడ్ చేసి వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లలో వెంట వెంట పోస్ట్ చేయాలని, అప్పుడే ప్రజలకు మరింత చేరువవుతామన్నారు.
కాషాయ జెండా ఎగరడం ఖాయం..
జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. సంగుపరివార్ బీజేపీపూర్వ కార్యకర్తలతో సమావేశమైన ఆయన ప్రజల నుంచి వస్తున్న సబ్ స్పందన చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అన్న ధీమా వ్యక్తం చేశారు. తనకంటే ముందుగా పార్టీలో పనిచేసిన వాళ్లను కార్యక్రమం ద్వారా ఆహ్వానించి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం పూర్వనేతలు వేదిక పైకి వెళ్లి కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాలను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు రెడ్డిగారి రమేష్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి వలకొండ రవీందర్ రెడ్డి, పట్టణ బీజేపీ అధ్యక్షులు గరిగంటి నర్సింలు, జగ్గన్నగారి ప్రతాపరెడ్డి, రెడ్డిగారి మోహన్ రెడ్డి, సింగం శ్రీనివాస్, మోతె కిష్టారెడ్డి, పుట్ట బాలరాజ్, ఏక్ నాథ్, ఉప్పరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.