గుండె నెమిలి గ్రామంలో రెండు దారుణ హత్యలు

by Sridhar Babu |
గుండె నెమిలి గ్రామంలో రెండు దారుణ హత్యలు
X

దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గుండె నెమలి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుండె నెమలి గ్రామానికి చెందిన అరుణతో శాంతాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తికి వివాహం జరగగా గత కొంతకాలం నుండి కుటుంబ కలహాలతో అరుణ ఆమె తల్లి గారు ఇంటి వద్దనే ఉంటుంది. శుక్రవారం అరుణ భర్త గుండె నెమలికి వచ్చి తన భార్యను సంసారానికి పంపిస్తారా లేదా అంటూ మామతో తగాదాకు దిగగా చినికి చినికి గాలి వానగా మారింది. గొడవ ఉద్రిక్తతకు దారితీయడంతో అల్లుడు సంతోష్ తనతో తీసుకొచ్చుకున్న కర్రతో మామ తలపై కొట్టాడు. దాంతో తీవ్ర రక్తస్రావమైన రాంబోయి అక్కడికక్కడే చనిపోయాడు. ఇది గమనించిన రాంబోయి కొడుకు సాయిలు, మనుమడు వేణు కలిసి సంతోష్ పై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. బిచ్కుంద ఎస్సై మురళి, సీఐ కృష్ణ ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed