ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్

by Sumithra |
ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్
X

దిశ, నిజామాబాద్ సిటీ : బైక్ చోరీలకు పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం గురువారం రురల్ ఎస్సై లింబ్రాద్రి, సిబ్బందితో కలసి కంటేశ్వర్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా బైక్ పై వచ్చారు.

దీంతో పోలీసులు వారిని వివరాలు అడుగుతుండగా పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకుని విచారించగా గతంలో చేసిన బైక్ చోరీల విషయాన్నీ తెలపడంతో చోరీ చేసిన బైక్ లను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ రురల్ సీఐ జె నరేష్, పోలీస్ సిబంది పాల్గొన్నారు.

Advertisement

Next Story