- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాడ్వాయిలో బతుకు జెట్కా బండి ఆగింది..
దిశ, తాడ్వాయి : తాడ్వాయి మండలంలో బతుకు జెట్కా బండి ఆగింది. గత నాలుగు నెలలు ఇక్కడి ప్రాంతంలో చెరుకు తోట పనులు ముగించుకుని సొంతగూటి బాట పడుతున్న గిరిజనులు. ఉగాది సంబరాలు జరుపుకోవాల్సిన గిరిజనులు తాడ్వాయిలో పొద్దుపొద్దున్న రోడ్డు ప్రక్కన బండ్లను ఆపుకొని విశ్రాంతి తీసుకుంటు కనిపించరు. వారిని దిశప్రతినిధి మాట్లాడించగా వారికష్టాలను వెళ్ళగక్కరు. పనిలేక పొట్ట కూటి కోసం గిరిజనులు పట్నం, ఫ్యాక్టరీ బాట పడుతున్నారు. పదుల సంఖ్యలో తండాలు, వందల సంఖ్యలో కుటుంబాలు వలసవెళ్తున్నాయి. గిరిజనులు లేక వారి గ్రామాలు చిన్నబోతున్నాయి. మేము తిరుగు ప్రయాణం చేసి వెళ్లేంత వరకు పల్లెల్లో వృద్ధులు, చిన్నారులు మినహా ఎవరూ ఉండరని అన్నారు.
దీనికి ప్రధాన కారణం ఉపాధి లేకపోవడం వర్షాభావ పరిస్థితులు తెలంగాణ వస్తే రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్ ముందుంటుందని అన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న గిరిజనులు, మట్టిమనుషుల వలసలు ఆగిపోతాయనుకున్నారు. బంగారు తెలంగాణ స్వప్నం సాకారమైన వేళబతుకు కోసం బయటకు వెళ్లిన వారంతా వెనక్కి వచ్చేస్తారని నమ్మారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయినా అడపాదడఫా నాయకులు ఉత్తుత్తి ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. నారాయణఖేడ్ నుంచి వలసలు మాత్రం తగ్గలేదని చెప్తున్నారు. మేము గెలిపించిన నాయకులు అద్భుతం ఏదో జరిగిపోతుందంటూ ఊదరగొడుతూనే ఉన్నారు. కానీ మేము ఇలా బతుకుదెరువు కోసం ప్రతికూల వాతావరణంలో భార్య పిల్లలను వెంట పెట్టుకొని రావాల్సివస్తుందని ఆవేదన వెళ్ళగట్టుకున్నారు.