సమగ్ర కుల గణనకు సమాయత్తం..

by Sumithra |
సమగ్ర కుల గణనకు సమాయత్తం..
X

దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర సామాజిక సర్వే (సమగ్ర కుల గణన) సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా నిజామాబాద్ జిల్లాలో సుమారు 50 లక్షల మంది బీసీల వివరాలను సేకరించేందుకు సిద్ధమైంది. అయితే పారదర్శకంగా కులగణనను నిర్వహించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు అన్ని బీసీ సంఘాలు సమగ్ర కుల గణనను పక్కాగా నిర్వహించేలా చూడటంతో పాటు బీసీలు ఈ కులగణనలో విధిగా పాల్గొనేలా చేయడానికి వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. జానాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర వర్గాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు వీలుగా గణన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు సామాజిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాల పై అంచనాకు వచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సిబ్బంది నియామకం..

ఇంటింటి సర్వే చేసేందుకు ఎంతమంది ఎన్యుమరేటర్లు అవసరమో అంచనా వేస్తున్నారు. 60 రోజుల్లో గణన పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అందుకు తగ్గట్లు ఉమ్మడి జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా శాఖల్లో పని చేసే సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. గణనకు ఎంత మంది ఎన్యూమరేటర్లు అవసరమవుతారు, ఎన్ని బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ? ఏఏ ప్రభుత్వ శాఖల నుంచి ఎన్యూమరేటర్లను సేకరించాలి ? అన్ని అంశాల పై (ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల (ప్రకారం ఉన్న వివరాలను పరిగణలోకి తీసుకుని బృందాలను ఎన్యూమరేటర్లను నియామకం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1500 జనాభాకు ఒక బృందాన్ని ఏర్పాటు చేని, సంబంధిత బృందంలో సుమారు 10 మంది ఎన్యూమరేటర్లను నియమించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు నెలల్లో కుల గణన సర్వేను పకడ్బందీగా పూర్తిచేసి నివేదించేందుకు సిద్ధమవుతున్నారు.

బీసీల లెక్కింపు ఇదే మొదటి సారి...

ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కలతో పాటు ఇతర సందర్భాల్లో ప్రభుత్వానికి అవసరమైన గణాంకాలు తీసుకున్న కులగణన మాత్రం చేపట్టలేదు. దీంతో బీసీలు ఎంత మంది ఉన్నారు ? ఏ కులం వారు ఎంత మంది ఉన్నారు ? కచ్చితమైన లెక్కలు లేవు. దీంతో బీసీలు కచ్చితంగా ఎంత మంది దారే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇది బీసీ వర్గాల్లో అసంతృప్తికి కారణమైంది. 2011 జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా, బీసీ గణాంకాలు బయట పెట్టలేదు. నాటి నుంచి బీసీ సంఘాల నేతలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉన్నత న్యాయ స్థానం సైతం బీసీ జనాభా తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే ప్రభుత్వం కుల గణనకు సంబంధించిన (ప్రశ్నా పత్రాన్ని విడుదల చేసింది. మొత్తం "5 ప్రశ్నలుండగా.. పార్ట్‌ 1 లో యజమాని కుటుంబ సభ్యులు వ్యక్తిగత వివరాలకు సంబంధించి 58 ప్రశ్నలు, పార్ట్‌ శిలో కుటుంబ వివరాలకు సంబంధించి 17 ప్రశ్నలు ఉంటాయి.

ఏకమవుతున్న కుల సంఘాలు...

బీసీ కులగణన నిర్వహిస్తున్న నేపథ్యంలో బీసీ కుల సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. కులగణన పక్కాగా పారదర్శకంగా జరిగేలా చూడడానికి తమ వంతుగా గణన జరిగేంత కాలం నిరంతర నిఘా వేసి ఉంచాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు కులసంఘాల నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతే కాకుండా బీసీ కులగణన వల్ల కలిగే ప్రయోజనాలు, కులగణనలో భాగస్వాములు కావలసిన ఆవశ్యకత గురించి బీసీలకు అవగాహన కలిగించేందుకు అప్పుడే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో బీసీ విద్యావంతులు, కుల సంఘాల ప్రముఖులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను నిర్వహిస్తున్నాయి.

గణాంకాలు దేనికైనా అవసరమే...

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా కుల గణనకు హామీ ఇచ్చింది. ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 84 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అభ్యర్థనలు వస్తున్నాయి. గతంలో పోలిస్తే ఓసీ జనాభా తగ్గి బీసీలు పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. కులగణన చేస్తే పథకాల రూపకల్పనకు ఉపయోగపడుతుంది. త్వరలో నిర్వహించే సర్పంచ్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు ఇది ప్రామాణికం కానుంది.

కుల గణన సర్వే నిర్వహించడం హర్షణీయం.. ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం కులగనన సర్వే మొదలు పెట్టిందని, ఈ సర్వే ప్రకారం బీసీల అభ్యున్నతికి తోడుపడుతుందని, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంకి బీసీ నాయకుల తరఫున ప్రత్యేక అభినందనలు.

పకడ్బందీగా కుల గణన సర్వే..తహశీల్దార్ రమేష్ ...

ప్రభుత్వ ఆదేశానుసారం ప్రకారం కుల గణన సర్వే పకడ్బందీగా నిర్వహిస్తామని, ఒక ఎమ్యులేటర్ కు 150 - 175 ఇల్లు కేటాయించమని తప్పులు లేకుండా నిర్వహిస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed