కాసులిస్తే సరి.. లేకుంటే కేసులే..

by Anjali |
కాసులిస్తే సరి.. లేకుంటే కేసులే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల నాలుగు నెలల కాలంలో జరిగిన బలవంతపు వసూళ్లపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాసులిస్తేనే సరి, లేకుంటే కేసులే.. జైలుకే అంటూ ఓ మాజీ అధికారి అండతో ప్రత్యేక ఫోర్స్ అధికారి రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో నగర శివారు బైపాస్ వెంట ఉన్న వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకుని దానిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించే స్థాయికి సెటిల్మెంట్లు చేసినట్లు తెలిసింది.

ఇప్పుడు ఆ గుసగుసలుగా బయటకు వస్తున్నాయి. కాసులు ఇస్తే సరి.. లేకపోతే కేసులే... జైలు ఉచలే అన్న సూత్రాన్ని పక్కాగా అమలు చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకెళితే.. డిచ్ పల్లి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ పోలీస్ సిబ్బంది ప్రైవేట్ గెస్ట్ హౌస్ ను అడ్డాగా చేసుకుని అన్ని సెటిల్మెంట్‌లను అక్కడి నుంచే చెసినట్లు సొంత పోలీస్ శాఖ కోడై కూస్తోంది.

గడిచిన నాలుగు నెలల కాలంలో ప్రత్యేక పోలీస్ కార్యాలయానికి వచ్చిన వారికి, కేసులు నమోదుకు సంబంధం లేకపోవడం వెనుక అన్ని స్పెషల్ ఫోర్స్ బుల్ పంచాయతీలో భాగమే అని చర్చ జరుగుతుంది. సివిల్ , రెవెన్యూ, నకిలీ, మీ సేవ అంటూ తమకు సబంధం లేనిది అంటు ఏది లేదు బాస్ చెప్పాడు అని ఎవ్వరికి వినేది లేదు అంటు బల ప్రయోగం అమలు వ్యవహరంపై ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

నగర శివారులో బైపాస్ వెంట ఉన్న వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకుని, దాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించే స్థాయికి సెటిల్మెంట్లు చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో భూముల యజమానులపై గతంలో ఉన్న పాత కేసులు తిరగదోడి రౌడీ షీట్లు రిఓపెన్ చేయిస్తానని లకారాలు వసూలు చేసినట్లు అంతా కోడై కూస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడ తమపై పాత కేసులు తిరగ తోడుతారని వారు అడిగినంత ఇచ్చుకుని తమ ఆధీనంలో ఉన్న కోట్ల విలువ చేసే భూమిని కాపాడుకున్నట్లు సమాచారం.

నిజామాబాద్ నగరంలో ఈ ఏడాది సంచలన కేసులుగా నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన నకిలీ పట్టాల కేసని చెప్పాలి. ఈ కేసును మొదటి నుంచి చివర వరకు పర్యవేక్షణ అంతా స్పెషల్ టీం కనుసన్నల్లో జరిగింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రిమాండ్ కు తరలించిన వ్యక్తులు ఇచ్చిన సమాచారం మెరకు డిప్యూటీ తహసీల్దార్, ముగ్గురు రిజిస్ర్టార్లతో పాటు ఓ సర్వేయర్, మున్సిపల్ ఉద్యోగి వద్ధ రూ.లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అంతేగాకుండా నకిలీ పట్టాల తయారీకి సహకరించిన డాక్యుమెంట్ రైటర్లను వదుల కుండా లక్షల వసూళు చేసినట్లు తెలిసింది. గతంలో మూడో టౌన్ లో నమోదైన నకిలీ పట్టాల సూత్రదారి మరో దళారీ ఆధ్వర్యంలో ఓ నకిలీ పట్టాల కేసులో వసూలు చేసిన మొత్తం రూ.30 లక్షలకు పైగానే ఉంటుందని చర్చ జరుగుతుంది.

మూడవ టౌన్ పరిదిలో 2000 సంవత్సరం నుంచి పోలీసులు కేసు నమోదు చేయకుండా ఉన్న కేసును బాధితులు కోర్టు ద్వారా 2022 జనవరిలో కేసు నమోదు చేయడంతో అందులోని సూత్రదారి, మరో దళారీ కలిసి తమతోనే నకిలీ పట్టాల దందాలో ఉన్న ఇద్దరిని కమిషనర్ పరిధిలో పని చేసే దీంతో దాడి చేయించి పట్టుకున్నట్లు బిల్డప్ ఇచ్చి పక్షం రోజుల పాటు తతంగం నడపడం గమనార్హం. సంబంధిత ప్రత్యేక అధికారి కార్యాలయం, ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఈ వ్యవహరంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

నకిలీ పట్టాల వ్యవహారంలో స్పెషల్ ఫోర్స్ ఫోకస్ అంతా దళారులు చెప్పినట్లే జరిపినట్లు సమాచారం. మీ సేవలో జరిగిన సెల్ఫ్ అసెస్మెంట్ అప్ లోడ్ అధారంగా, బల్దియాలో ఇంటి నెంబర్ల కేటాయింపు, వాటి ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్‌ల విషయంలో ఉప్పందించినట్లు సమాచారం. దానితోనే నగరంలోని 7 మీ సేవా కేంద్రాల నిర్వహకులను రప్పించారు. వారికి తోడుగా బల్ధియా ఉద్యోగిని, సబ్ రిజిస్ట్రార్ ( సీనియర్ అసిస్టెంట్)లను, డాక్యుమెంట్ రైటర్లు రప్పించి తతంగం జరుపడం గమనార్హం.

ఈ వ్యవహారంలో ఓ ప్రజాప్రతినిధి తమ్ముడిని అడ్డుపెట్టుకుని ఇద్దరు నకిలీ పట్టాల సూత్రధారులు ఆడింది ఆట.. పాడింది పాటగా జరుగడంతో రూ.లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. తమకు థర్డ్ డిగ్రీ చేసే అధికారం లేకపోయినా నిజామాబాద్ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మీసేవ నిర్వాహకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో అతడు చివరకు రూ.1.50 లక్షలు ఇచ్చి స్పెషల్ ఫోర్స్ వేధింపుల నుండి తప్పించుకున్నట్లు మీ సేవా కేంద్రాల నిర్వాహకుల అసోసియేషన్‌లో చర్చ జరుగుతుంది.

మీసేవ కేంద్రాల నిర్వహకుల వద్ద జరిగిన వసూళ్లు రూ.లక్షల్లో ఉన్న ఎక్కడ నకిలీ పట్టాల కేసులో ఒక్క మీ సేవ కేంద్రం నిర్వాహకుడి పేరు లేకపోవడం ఉదాహరణగా చెప్పవచ్చు. సస్పెక్ట్ గా తీసుకువచ్చామని చెబుతూనే రెండు మూడు కేసుల్లో తీసుకు వచ్చిన వారి సంఖ్య రెండంకెలకు పైగా ఉండగా కేసుల నమోదు, రిమాండ్, విచారణ ఎదుర్కొంటున్న వారికి పొంతన లేకపోవడంతో సంబంధిత ఫోర్స్ లో జరిగిన వసూళ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story